◆ తాగితే మనుషులు మృగాలవుతారనడానికి ఇదొక నిదర్శనం..
◆ తాగినప్పుడు స్నేహితులు బంధువులు ఎవరూ కనబడరని రాక్షసుడు అవుతారని తెలిపేదే ఈ ఘటన..
కర్నూలు జిల్లా అదోనిలో 19వ తేదీ తాగిన మత్తులో శంకర్ అనే వ్యక్తి హత్య కేసును 3టౌన్ పోలీసులు ఛేదించారు. నలుగురు ముదాయులు రామలింగడు, జగన్నాథ్ రెడ్డి, జయరామి రెడ్డి, రామకృష్ణ లను అరెస్ట్ చేసి డిఎస్పి ముందు హాజరు పరిచరు. ఈ సందర్భంగా డిఎస్పి శివ నారాయణ స్వామి మాట్లాడుతూ ఈ కేసులో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషించాయని వాటి ఆధారంగా ముద్దాయిలను శుక్రవారం 12 గంటలకు అరెస్టు చేసి రిమాండ్ కి తమిస్తున్నట్లు తెలిపారు. ముద్దాయిలందరూ స్నేహితులే అని ఉదయం నుంచి తాగుతూ మాటా మాటా పెరిగి కొట్టుకున్నారని తెలిపారు.