కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మధిర గ్రామంలో సిపిఎం ప్రతినిధి బృందం పొలాలలో పంటలను పరిశీలించారు. వర్షాలు లేక ఎండిపోతున్న మిరప, ఉల్లి పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పొలాలకు తడుపుతున్న రైతు రామాంజనేయులు పొలాన్ని పరిశీలించారు. ఆ రైతును అడిగి వివరాలు తెలుసుకొన్నారు రైతు రామాంజనేయులు మాట్లాడుతూ ఒకసారి ఎకరా పొలం తడపాలంటే 30 వేల రూపాయలు ఖర్చవుతుందని, ఏడెకరాలకు ఒకసారి 2 లక్షల పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపాడు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కే. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, పంట చేతికి వస్తుందో లేదో గ్యారెంటీ లేని దానికోసం ఒక ఎకరాకు 1 లక్ష 50 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. ఇంత తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరువు మండలాల ప్రకటన విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకోసమే సిపిఎం పార్టీగా అక్టోబర్ 30 నుండి ఆదోని నుండి రాయలసీమ రైతుల కరువు యాత్ర పేరిట బస్సు జాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కే. ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, బిరామాంజనేయులు, వెంకటేశులు సిపిఎం మండల కార్యదర్శి కే లింగన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, మండల నాయకులు రామాంజనేయులు, తిక్కప్ప, తదితరులు పాల్గొన్నారు.