ఆదోని, ఫిబ్రవరి 18: ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే? కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు […]
నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
ఆదోని రూరల్, ఫిబ్రవరి 18: కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు. ఘటన వివరాలు: పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి […]
మహిళా భద్రతపై అవగాహన సదస్సు
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరియు ఆదోని డిఎస్‌పి శ్రీ హేమలత ఆదేశాల మేరకు, ఆదోని మండలం ధనాపురం గ్రామంలో మహిళా భద్రతపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇస్వి పోలీస్ సిబ్బంది పాల్గొని గ్రామస్థులకు పలు కీలక సూచనలు చేశారు. అవగాహన కల్పించిన అంశాలు: ఈ సందర్భంగా సీఐ (CI) నల్లప్ప మరియు ఇస్వి ఎస్ఐ (SI) మహేష్ కుమార్ మాట్లాడుతూ, మహిళలు మరియు […]
వ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య.. వ్యాధి నయం కావడం లేదన్న బెంగతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఆదోని సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ఆదోని మండలం చాగి గ్రామానికి చెందిన మాల మల్లప్ప అనే వ్యక్తి గత కొంతకాలంగా కడుపులో గడ్డల సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు అతడిని ఆదోనిలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో […]