కర్నూలు జిల్లా ఆదోని నూతన రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఆమె పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, పరిపాలనాంశాలపై కలెక్టర్ సిరి నూతన ఆర్డీవోకు పలు సూచనలు చేశారు.
అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.