రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు జొన్నలు పంపిణీ

రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెల పంపిణీ చేసే బియ్యంతో పాటు ఒక కేజీ జొన్నలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని

కర్నూలు జిల్లా ఆదోని తాసిల్దార్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఇంద్ర గాంధీ నగర్ నందు ఎం.డి.యు వాహనం ద్వారా ప్రజలకు బియ్యంతో పాటు ఒక కేజీ జొన్నలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నిత్యవసర సరుకులు బియ్యం, కందిపప్పు, చక్కెర, మరియు జొన్నలు పంపిణీ చేయడం సంతోషమన్నారు.

జొన్నలు పంపిణీ చేస్తున్న తహసిల్దార్ వెంకటలక్ష్మి

ఈ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ ఉప తాసిల్దార్ వలి భాష, మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ఇంచార్జ్ మునివెలు, వీఆర్వో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version