కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు..వెల్లాల మధుసూధనశర్మ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎండోమెంట్ దేవస్థాన పాలకమండలి కమిటీలలో మరియు ప్రతి పాలకమండలి కమిటీలో ఇద్ధరు బ్రాహ్మణులకు ఉండేట్టు చూస్తామని అందుకు అనుగుణంగా బిల్లును అసెంబ్లీలో ఆమోదించడానికి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని ఆదోని బిజెపి నాయకుడు వెల్లాల మధుసూదనశర్మ మరియు మున్సిపల్ కౌన్సిలర్ వి.లలితమ్మ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు.
ఈ సందర్భంగా వీరిరువురు మాట్లాడుతూ గత ప్రభుత్వ పరిపాలనలో బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల బ్రాహ్మణులు ఆర్థికముగా, రాజకీయంగా, సామాజికంగా చాలా కష్టనష్టాలను ఎదుర్కొన్నారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన బ్రాహ్మణులకు ఆత్మాభిమానం పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి పురేంధేశ్వరికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి, మరియు కూటమి నాయకులందరికీ పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు లలితామధుసూధనశర్మ దంపతులు తెలియచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version