ఇవాళ్టీ నుంచి బడ్జెట్ సమావేశాలు.
● సమావేశాల తొలి రోజునే బడ్జెట్ పెట్టనున్న ప్రభుత్వం.
● తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.
● ఉదయం 10గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్.
● మంత్రి పయ్యావులకు బడ్జెట్ పత్రాలు అందచేసిన ఆర్థికశాఖ అధికారులు.
● మంత్రికి బడ్జెట్ పత్రాలు అందించిన పీయూష్ కుమార్, జానకీ, నివాస్.
● బడ్జెట్ పత్రాలకు పూజలు నిర్వహించిన కేశవ్.
● బడ్జెట్ పత్రాలతో సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన పయ్యావుల.
● అర్థరాత్రి వరకు బడ్జెట్టుపై తుది కసరత్తు చేసిన పయ్యావుల.
● ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీదే పాలన చేసిన కూటమి సర్కార్.
● ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చెమటోడుస్తోన్న చంద్రబాబు టీమ్.
● ఫైనాన్షియల్ టఫ్ టైంలో ఆర్థిక మంత్రిగా పయ్యావుల బాధ్యతలు.
● సంక్షేమం, అభివృద్ధి రెండు రంగాలకూ బడ్జెట్టులో సమ ప్రాధాన్యత ఉండేలా కసరత్తు.
● అమల్లోకి వచ్చిన సూపర్ సిక్స్ హామీలకు నిధుల కేటాయింపు.
● పెన్షన్లు, దీపం-2.0, అన్న క్యాంటీన్ల పథకాలకు నిధుల కేటాయింపు.
● ఇరిగేషన్, రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణానికి నిధుల కేటాయింపుపై బడ్జెట్టులో ఫోకస్.
● పోలవరం, రాజధాని పనుల పునః ప్రారంభానికి నిధుల లేమి లేకుండా బడ్జెట్లో ఏర్పాట్లు.
● కేంద్రం నుంచి వచ్చే నిధులను అనుసంధానించి బడ్జెట్ రూపకల్పన చేపట్టడంపై ప్రత్యేక శ్రద్ధ.
● పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌళిక సదుపాయాలకు నిధుల కల్పన.
● ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల కేటాయింపుపై పయ్యావుల ఫోకస్.
● నరేగా కింద చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక దృష్టి.
● ప్రభుత్వం తెచ్చిన వివిధ పాలసీలకు అనుగుణంగా అవసరమైన మేరకు నిధుల సర్దుబాటుపై పయ్యావుల కసరత్తు.
● పెండింగులో ఉన్న ఫీజు రీ-ఇంబర్సుమెంట్, ఆరోగ్య శ్రీ నిధుల చెల్లింపులపై ఫోకస్ పెట్టిన పయ్యావుల.