కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో చైర్మన్ మరియు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కమిటీ డివిజనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషన్, పంచాయతీరాజ్, మెడికల్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.
ఆదోని డివిజన్ లో రోడ్డు ప్రమాదాలను నివారించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవలసిన పనులు, పాటించవలసిన నియమాలు గురించి చైర్మన్ మరియు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సమావేశానికి ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత, ఎమ్మిగనూరు డిఎస్పి ఉపేంద్ర బాబు, కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఆదోని ట్రాఫిక్ సిఐ హాజరయ్యారు.