కాలేజీలో టవర్ ను తొలగించండి.. పిడిఎస్ఓ విద్యార్థి సంఘం

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెట్‌వర్క్ టవర్‌ను వెంటనే తొలగించాలి పి డి ఎస్ ఓ విద్యార్థి సంఘం  ఆధ్వర్యంలో  నెట్వర్క్ టవర్ ముందు ధర్నా  కార్యక్రమం నిర్వహించారు. నెట్వర్క్ టవర్ ను తొలగించకపోతే దశల వారి ఉద్యమాలకు సిద్ధమవుతామని వీడియోసు విద్యార్థి సంఘం నాయకుడు హెచ్చరించారు. అనంతరం PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజ్ మైదానంలో టవర్ ఉండటం వల్ల విద్యా వాతావరణం ప్రభావితం అవుతోందని వారు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ చొరవ చూపి   తక్షణమే టవర్‌ను తొలగించాలని వారు కోరారు. టవర్ ను తొలగించ లేకపోతే విద్యార్థులు అందరినీ సమీకరించి రానున్న రోజుల్లో ఆందోళనలు ధర్నాలు  చేస్తామని తెలిపారు. వేలాది మంది విద్యార్థులు చదువుతున్న కాలేజీలో విద్యార్థులకు రేడియేషన్ సంబంధించి అనారోగ్యా పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి శివ , కార్యకర్తలు వసంత , అర్జున్, సూర్య, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘం నాయకులు తిరుమలేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version