చెడు నడవడిక గల వారికి పోలీసుల కౌన్సిలింగ్

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  చెడు నడవడిక గల వారందరినీ పిలిపించి సిఐ ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ మీడియాకు తెలిపిన వివరాలు కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు ఆదోని సబ్ డివిజనల్ ఆఫీసర్ మేడమ్  హేమలత పర్యవేక్షణలో ఈ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కౌన్సిలింగ్ లో పాల్గొన్న  వారందరినీ మంచి ప్రవర్తనతో ఉండాలని, ఎటువంటి క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దని, సమాజంలో మంచిగా బతుకుతూ,  ఇతరుల పట్ల సోదర భావం కలిగి ప్రశాంతంగా  జీవించాలని తెలియజేశారు.

కౌన్సిలింగ్ ఇస్తున్న సిఐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version