మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం భారీ ర్యాలీ

కర్నూలు జిల్లా ఆదోనిలో డి.ఎస్.పి హేమలత పర్యవేక్షణలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి,  సబ్ కలెక్టర్  మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్కూలు, కాలేజీ  విద్యార్థిని, విద్యార్థులు పోలీస్, ఎక్సైజ్, ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ వెల్ఫేర్, రెవిన్యూ  ఇతర డిపార్ట్మెంట్లు కలిసి భారీ ర్యాలీ నిర్వహించరు. ఈ ర్యాలీ మున్సిపల్ గ్రౌండ్ నుండి  శ్రీనివాస భవన్,  గవర్నమెంట్ హాస్పటల్ మీదుగా ఎమ్ ఎమ్ రోడ్డు వరకు నిర్వహించారు. ఎమ్ ఎమ్ రోడ్డు మానవహారం గా ఏర్పడి  మాదకద్రవ్యాల నివారణ, దానిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మరియు మాదకద్రవ్యాలు వాడటం వల్ల కలిగే అనర్ధాలను అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ డివిజన్ లోని సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మానవహారంగా ఏర్పడి విద్యార్థులు అధికారుల ఫోటో
అధికారులు విద్యార్థులు కలిసి ర్యాలీ నిర్వహిస్తున్న ఫోటో
మాదకద్రవ్యాలు వాడటం వల్ల కలిగే అనర్ధాలను తెలుపుతున్న సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ర్యాలీలో పాల్గొన్న సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఎమ్మెల్యే పార్థసారథి డిఎస్పి హేమలత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version