2వ తరగతి చదువుతున్న విద్యార్థి ఔదార్యం

వరదబాధిల సహాయార్థం పిల్లలందరూ ఎంతోకొంత సహాయం చేయమని సామాజిక స్పృహ కలిగించే విధంగా పిలుపునివ్వడముతో వెంటనే స్పందించిన కిడ్డీస్ రూట్స్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న వెల్లాల యాగ్నిక్ తను హుండీలో కూడబెట్టిన 2080రూపాల డబ్బు మొత్తాన్ని స్కూల్ ఏర్పాటు చేసిన వదరబాధితుల సహాయార్థం హుండీలో వేసి ఔదార్యాన్ని చాటుకున్నారు

హుండీలో డబ్బులు వేస్తున్న విద్యార్థి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణములోని కిడ్డీస్ రూట్స్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న వెల్లాల హరిణికిరణ్ దంపతుల కుమారుడు యాగ్నిక్ శర్మ తన తల్లిదండ్రుల మరియు నాన్నమ్మ తాతయ్య లలితామధుసూధనశర్మ లు ఇచ్ఛిన ప్యాకెట్ మని డబ్బులను ఖర్చు చేయకుండా ఎప్పటికప్పుడు హుండీలో వేసుకుని దాచుకునేవాడు, నిన్నటి రోజున కిడ్డిస్ రూట్ స్కూల్ డైరెక్టర్లు కేశవ్ నారాయణరెడ్డి మరియు నారపురెడ్డిగారు వరదబాధిల సహాయార్థం పిల్లలందరూ ఎంతోకొంత సహాయం చేయమని సామాజిక స్పృహ కలిగించే విధంగా పిలుపునివ్వడముతో వెంటనే స్పందించిన యాగ్నిక్ తను హుండీలో కూడబెట్టిన 2080రూపాల డబ్బు మొత్తాన్ని స్కూల్ ఏర్పాటు చేసిన వదరబాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన హుండీలో వేసి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు
.ఈ సందర్భంగా వెల్లాల మధుసూదనశర్మ మాట్లాడుతూ స్కూల్ డైరెక్టర్లు  కేశవనారాయణరెడ్డి ,నారపురెడ్డి పిల్లలలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతలను పెంపొందించడమే కాకుండా, మన ఆంధ్ర రాష్ట్రములో వరదల వలన తీవ్రంగా నష్టపోయిన మన తోటి సోదర సోదరీమణులకు ఎంతోకొంత చేయూత నివ్వడం కోసం మంచి కార్యక్రమం చేపట్టారని, అందుకు స్కూల్ యాజమాన్యానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్టు మధుసూదన శర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version