రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆదోని మండలం లోని గ్రామాల రైతు సోదరులకు ప్రభుత్వ రాయితీ ద్వారా వేరుశనగ పంపిణీ చేస్తుందని రైతు సేవ కేంద్రాలలో రాయితీ వేరుశనగ కోసం రైతులు తమ ఆధార్ కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వేరు శనగ విత్తనాలు (K 6) రకం కావాల్సిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొని విత్తనాలు పొందవచ్చని ఒక రైతుకు ఎకరాల ప్రకారం (0.5 ఎకరాలకు 1 బ్యాగు, 2 ఎకరాలకు 03బ్యాగులు) గరిష్టంగా 3 బ్యాగుల వరకు ఇస్తున్నట్లు తెలిపారు, ఒక బ్యాగు బరువు 30 కేజీలు. ఉంటుందని వేరు శనగ క్వింటాలు ధర 9300/- కు, ప్రభుత్వ రాయితీ  3720/- రైతు వాటా 5580/- కట్టాలని అన్నారు.

రాయితీ వేరుశనగ అందిస్తున్న ఫోటో
రాయితీ వేరుశనగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version