సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు లైనింగ్ గోడలకు పగుళ్లు

◆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు లైనింగ్ గోడలకు పగుళ్లు..
◆ సీఎం దృష్టికి తీసుకువెళ్లి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతాం. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి..

ఎస్ ఎస్ బ్యాంక్ ధ్వంసమైన సైడ్ గోడలు


కర్నూలు జిల్లా ఆదోనిలో 2లక్ష ల 50 వేల మంది ప్రజలకు త్రాగునీరు అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు సౌత్ సైడ్ సుమారు 100 మీటర్లు సిమెంట్ లైనింగ్ గోడలకు పగుళ్లు వచ్చా కూలిపోయాయి. వెంటనే సమాచారం అందుకున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధికారులతో ఎస్ ఎస్ ట్యాంక్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకా 200 మీటర్లు కూలిపోవడానికి ఉబ్బి సిద్ధంగా ఉంది అని ఈ విషయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పనులు మొదలు పెడతామని తెలిపారు.
మున్సిపల్ ఇంజనీర్ నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ సుమారు రెండు లక్షల 50 వేల మందికి త్రాగునీరు అందించే ఎస్ ఎస్ ట్యాంక్ ను యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలి లేదంటే ఆదోని పట్టణ ప్రజలకు నీటిని అందించడానికి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై పూర్తి ఎంక్వయిరీ చేసి పై అధికారులకు సమాచారం అందిస్తామని అన్నారు.

వీడియో చూడాలంటే దీనిపై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version