ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో గత 2021 ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా 2వ వార్డుకు పోటీచేసి, తుంబలం మూకయ్య గెలుపొందారు. 2022 నవంబర్లో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు.
2వ వార్డుకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సిపిఎం తరపున తుంబలం ముకయ్య 2వ కుమారుడు తుంబలం వెంకటేశ్వర్లు
నామినేషన్లు దాఖలు చేశారు.
వారి నాయన మరణాంతరం జరుగుతున్న ఎన్నికలు కావడంతో వైసిపి టిడిపి జనసేన పార్టీలు అభ్యర్థులను నిలబెట్టకుండా తుంబలం వెంకటేశ్వర్లు కు మద్దతు ఇస్తామని చెప్పడంతో 2వ వార్డుకు వార్డు మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
2వ వార్డు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థి తుంబలం వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ మండల నాయకులు రామాంజనేయులు, శాఖ కార్యదర్శులు పాండురంగ, అనిఫ్, గోవిందు వార్డు సభ్యులు కృష్ణ, స్థానిక కార్యకర్తలు హుసేని, మల్లి మాట్లాడుతూ రెండో వార్డును ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన వైసిపి టిడిపి జనసేన పార్టీల నాయకులు మరియు పాండవగల్ గ్రామ 2 వ వార్డు ఓటర్లకు, ప్రజలకు సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.