విద్యాధికారులు కుర్చీలకే పరిమితమయ్యారా? DSF

ఆదోని పట్టణంలో SC BC సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి హాస్టల్ సీటు ఇవ్వాలని DSF ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ లో కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కనీసం ఒక్కసారైనా విజిట్ చేశారా….?? లేదా …? కేవలం సీటుకు మాత్రమే పరిమితం అవుతున్నారా మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నత విద్యాధికారులు ఆదోని పట్టణంలో ఎస్సీ బీసీ సంక్షేమ హాస్టల్స్ ను ఒకసారి విజిట్ చేసి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు కిరణ్, మోహన్, హరికృష్ణ, రవి, మనోజ్, వీరాంజనేయులు, విక్రమ్, మౌనేష్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్
యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version