​బీసీ వసతి గృహాల్లో ఆర్డీవో అరుణ దేవి ఆకస్మిక తనిఖీ

ఆదోని, జూలై 27: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు, విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కె. అరుణ దేవి తెలిపారు. సోమవారం ఆదోని పట్టణంలోని బీసీ బాలుర, కళాశాల బాలికల వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న ఆర్డీవో అరుణాదేవి

ఈ సందర్భంగా హాస్టళ్లలో ఆహార నాణ్యత, వంటశాలల శుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు రికార్డులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వంటశాలను పరిశీలిస్తున్న ఆర్డీవో అరుణాదేవి

​అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ… మెనూ ప్రకారమే పోషకాహారం అందించాలని, పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని వార్డెన్లను హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తనిఖీల్లో గుర్తించిన చిన్నచిన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version