సాయి నామినేషన్కు తరలివచ్చిన జన ప్రభంజనం..

కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి వై. సాయి ప్రసాద్ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా నామినేషన్ కు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పూర్తి వీడియో కాల్ ఉంటే యూట్యూబ్ లింక్ లో చూడండి

నామినేషన్ వేసిన అనంతరం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓటేసి గెలిపించాలని ప్రజలను విన్నవించారు. ప్రజలపై తనకు నమ్మకం ఉందని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించామని అదే నమ్మకంతో నాలుగో సారి కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తారని తెలిపారు. వలస పక్షుల్ని నమ్మొద్దని విడదీసి పాలించు అన్న సిద్ధాంతంతో పోతున్న కూటమి పార్టీలను నమ్మొద్దని, తనపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు.

నామినేషన్ కు తరలివచ్చిన ఘన ప్రభంజనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version