అక్రమంగా ఎర్ర మట్టిని తవ్వుకొని సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

◆ కొండల్లో అనుమతులు లేకుండా తవ్వకాలు..
◆ అక్రమంగా ఎర్ర మట్టిని తవ్వుకొని సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు..
◆ దెబ్బతింటున్న ప్రకృతి పర్యావరణం..

ఆదోని తాసిల్దార్ శ్రీమతి వెంకటలక్ష్మి కి వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు.

కర్నూలు జిల్లా ఆదోని చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత కొండల్లో అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుందని సిపిఎం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగుట్ట పాండురంగ స్వామి కొండ, ఆంజనేయ స్వామి విగ్రహం కొండ, దొడ్డనకేరి రూట్ లో ఉన్న ఎల్లమ్మ కొండలు, దిబ్బనకల్లు, గోనబావి, కడితోట, పరిసర కొండల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్ర మట్టిని తవ్వుకొని సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పట్టణ కార్యదర్శి డి లక్ష్మన్న, మండల కార్యదర్శి కే లింగన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ గోపాల్, తిప్పన్న, ఆవాజ్ నాయకులు ఎక్బల్ హుస్సేన్ ఆదోని తాసిల్దార్ శ్రీమతి వెంకటలక్ష్మి కి వినతిపత్రం అందజేశారు.

వీడియో లింక్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version