మత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు

మద్యం మత్తులో వాహనాలు నడిపితే తీవ్రమైన శిక్షలు తప్పవని మరోసారి రుజువు అయ్యింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లో పట్టుబడిన వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచిన పోలీసులు

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లో పట్టుబడిన 15 మందిని పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వారిలో ట్రాఫిక్ పోలీసులు నలుగురిని, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మందిని అదుపులోకి తీసుకుని కోర్టు లో హాజరు పరుచగా విచారణ అనంతరం న్యాయమూర్తి 4 గురికి ఒక వారం రోజులు, 5 గురికి 30 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదోని సబ్ జైలుకు తరలించరు. 6గురికి 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించరు. రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకులు ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతో పాటు, అన్ని రకాల వాహనాలను నడిపే వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను రోడ్డుపై నడపవద్దని, ఇది చాలా ప్రమాదకరమని ఇకపై ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో పట్టుపడితే ఇదే విధమైన జైలు శిక్ష తప్పదని ఆదోని పోలీసులు హెచ్చరించరు.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లో పట్టుబడిన వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచిన పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version