అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్

కర్నూలు జిల్లా అదోనిలో అంతర్ జాతీయ డీజిల్ దొంగలు 11 మంది ముఠా ను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారివద్ద నుంది 1లక్ష 30 వేలు 140 రూపాయల నగదు నాలుగు కార్లు 350 లీటర్ల డీజిల్ క్యాన్లు 10 ఖాళీ క్యాన్లు స్వాధీనం చేసుకున్నరు. మరో ముగ్గురు మురారి లో ఉన్నట్లు సిఐ శ్రీరామ్ తెలిపారు. ముద్దాయిలను డిఎస్పి హేమలత ముందు హాజరు పరిచారు. డీఎస్పీ హేమలత మీడియాతో మాట్లాడుతూ వీరంతా తెలంగాణ రాష్ట్ర నికి చెందిన వారని. హైవేలలో నిలబెట్టిన లారీలు వీళ్ళ టార్గెట్ అని తెలిపారు. వీరిపై ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, ఆలూరు కర్నూల్ లో కూడా వీరిపై కేసులు ఉన్నాయని మరియు తెలంగాణలో కూడా వీరిపై కేసులు ఉన్నాయని తెలిపారు. వివిధ కేసులలో మొత్తం 10,620 లీటర్ల డీజిల్ దొంగతనము చేసినట్లు విచారణలో తేలిందని ఐతే మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

పోలీసులకు స్వాధీనం చేసుకున్న 350 లీటర్ల డీజిల్
మీడియా ముందు దొంగలను హాజరు పరిచిన పోలీసులు
దొంగతనానికి వాడుతున్న కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
దొంగతనానికి వాడుతున్న కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version