కులమతాలకు అతీతంగా అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కులమతాలకు అతీతంగా అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం హక్కులు కల్పించిన మహోన్నత రాజనీతిజ్ఞుడు అని ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్ అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పత్తికొండలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి తేరు బజార్, గుత్తి సర్కిల్, నాలుగు స్తంభాల కూడలి మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ఎమ్మార్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ చేరుకున్న అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ మీడియాతో మాట్లాడారు.

యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version