కర్నూలు జిల్లా ఆదోని పట్టణం లోని పరిశ్రామికవాడ నుంచి హనుమాన్ నగర్ వరకు 33 కెవి విద్యుత్తు లైను నిర్మాణం చేపడుతున్నందున శనివారం పట్టణంలోని హనుమాన్ నగర్, కిల్చిం పేట,బుద్దెకల్,వాల్మీకి నగర్, బోయగేరీ, సంతపేట, వడ్డేగేరి,చిన్న శక్తి గుడి,పెద్ద శక్తిగుడి, ఫారెస్ట్ లైన్, శుక్రవార్ పేటతో పాటు మరికొన్ని ప్రాంతాలల్లో ఉదయం గం 9 నుంచి మధ్యాహ్నం గం 2 వరకు విద్యుత్తు సరఫరా ఉండదని విద్యుత్తు శాఖ ఆదోని ఏడీఈ పురుషోత్తం తెలిపారు.విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు