నిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్

ఆదోని నియోజకవర్గంలోని నిజాముద్దీన్ కాలనీ పరిధిలో శుక్రవారం వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఆర్. ఫయాజ్ అహ్మద్ నిజామీ ఆధ్వర్యంలో 144, 145, 146 బూత్‌లకు సంబంధించిన బీఎల్‌ఓలు, బూత్ కమిటీ సభ్యులతో కలిసి ఇంటింటికీ వెళ్లి SIR ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇంటింటికి వెళ్లి ఎస్ ఐ ఆర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఫయాజ్ అహ్మద్

ఈ సందర్భంగా ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా SIR ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. ఇప్పటికే చాలామంది తమ ఓటరు వివరాలను ధృవీకరించుకున్నప్పటికీ, ఇంకా కొందరు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు.

ఇంటింటికి వెళ్లి బి ఎల్ ఓ లతో ఎస్ ఐ ఆర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఫయాజ్ అహ్మద్

మరో 3 రోజుల్లో వెరిఫికేషన్ గడువు ముగియనున్నందున, ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. వెరిఫికేషన్ చేయించుకోని వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

ఇంటింటికి వెళ్లి ఎస్ ఐ ఆర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఫయాజ్ అహ్మద్

అలాగే ప్రతి కుటుంబం తమ ఓటు హక్కును పరిరక్షించుకునే బాధ్యతతో ముందుకు రావాలని, అవసరమైతే సంబంధిత BLO, BLA లేదా ఎన్నికల అధికారులను సంప్రదించి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనదని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

వెరిఫికేషన్ కోసం ఇప్పటికే ఉన్న ఓటర్ ఐడీ, పాత ఓటర్ వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను జత చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు ప్రజలందరూ సహకరించి, నిర్ణీత గడువులోపు తమ SIR ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version