కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించరు. ఈ సమావేశంలో పాల్గొన్న కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 42వ వార్డు కౌన్సిలర్ సి. హెచ్. లోకేశ్వరి చైర్ పర్సన్ పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా 36 వార్డు కౌన్సిలర్ సందీప్ రెడ్డి ప్రతిపాదించరు మరియు 40 వార్డు కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ బలపరచడంతో సి. హెచ్. లోకేశ్వరి ఏకగ్రీవంగా ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికలకు 36 మంది వార్డు కౌన్సిలర్లు మరియు ఎమ్మెల్సీ డాక్టర్. మధుసూదన్ పాల్గొన్నారు.
అనంతరం, ప్రెసిడింగ్ ఆఫీసర్ & సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సి. హెచ్. లోకేశ్వరి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య పాల్గొన్నారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.