ఆదోని పట్టణ సమగ్ర అభివృద్ధి సాధించాలంటే కమర్షియల్ భవనాల నిర్మాణాల్లో ప్రతి ఒక్కరూ మున్సిపల్ నిబంధనలు, పట్టణ ప్రణాళిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్థానిక శాసనసభ్యులు డా. పి.వి. పార్థసారథి వాల్మీకి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదోనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాల వల్ల పట్టణంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. […]
ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు ప్రారంభం
గోనెగండ్ల (కర్నూలు జిల్లా): ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం నిర్వహించే “ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు” కార్యక్రమాన్ని గోనెగండ్ల మండల కేంద్రంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై ప్రజల నుండి వినతులను స్వీకరించారు. బైలుప్పల గ్రామానికి చెందిన రైతు దాసరి జాంబయ్యకు చెందిన 2.70 ఎకరాల భూమి గత 18 ఏళ్లుగా పొరపాటున ఇనాం […]
ఆదోని మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి
ఆదోని, జూలై 31: తుంగభద్ర డ్యామ్ నుంచి కెనాల్‌కు కొత్త నీరు విడుదల చేసిన నేపథ్యంలో, పట్టణ ప్రజలందరూ తాగునీటి వినియోగంలో కొన్ని రోజుల పాటు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఆదోని మున్సిపాలిటీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. తుంగభద్ర ఎల్ ఎల్ సి కాల్వలో కొత్తగా నీటిని విడుదల చేసిన ప్రారంభ రోజుల్లో నీటితో పాటు మట్టి, చెత్త మరియు ఇతర అవశేషాలు కలిసి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ దృష్ట్యా మున్సిపాలిటీ […]
జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి.. APWJF
ఆదోని 31.07.2026 : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (APBJA) ఆదోని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ… సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల రక్షణ, సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మార్చి 4న నిర్వహించిన మహాపదయాత్రలో […]
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
హోస్పేట: 31.07.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 31 (శుక్రవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1609.74 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 37.063 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది […]