Day: August 26, 2026

కైలాస మానససరోవర యాత్రికులకు ఆదోని ఎమ్మెల్యే భరోసా

​కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి వరదల కారణంగా చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చే బాధ్యత తమదని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి భరోసా ఇచ్చారు. యాత్రికుల బృందంలోని భాస్కర శాస్త్రి కుమారుడితో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. 15 రోజుల క్రితం తీర్థ  యాత్రలకు వెళ్లి కైలాస మానససరోవర యాత్రలో చిక్కుకున్న ఆదోని కి చెందిన నలుగురు యాత్రికులు భాస్కర్ శాస్త్రి,  భార్య శారద తో  పాటు కొడుకు రఘునాథ శాస్త్రి,  కోడలు హన్సిక. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయి దాదాపు పది వంతెనలు […]

దేవాలయ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రజకుల కులదైవం శ్రీ మడివాల మాచయ్య స్వామి దేవాలయ నిర్మాణానికి బుధవారం (26 ఆగస్టు 2026) ఘనంగా భూమి పూజ నిర్వహించారు. రజక సంఘం ఆహ్వానం మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు బి. దేవా మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి రజకుల సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. గతంలో ఆయన […]

తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

హోస్పేట: 26.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. ఆగస్టు 26 (బుధవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1630.25 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 95.009 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి […]

Back To Top
Exit mobile version