Day: August 19, 2026

తుంగభద్ర నీటి విడుదలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

విజయవాడ, ఆగస్టు 18: ఆయకట్టు రైతులకు సాగునీటితో పాటు పరివాహక ప్రాంత ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలో మంగళవారం తుంగభద్ర ప్రాజెక్టు నీటి విడుదల అంశంపై మంత్రి అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంబంధిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని తుంగభద్ర పరివాహక ప్రాంత పరిస్థితులు, నీటి లభ్యత, […]

పంచాయతీలో నిధులు ఖాళీ.. కార్మికుల కడుపు ఖాళీ!

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలో నిధులు లేవనే నెపంతో కార్మికుల జీతాలు నిలిపివేయడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీ పరిధిలోని స్వీపర్లు, వాటర్‌మెన్లు తదితర సిబ్బందికి 4 నెలల నుంచి […]

సర్క్యూట్ బెంచ్ వద్దు.. కర్నూలులో శాశ్వత హైకోర్టు ఏర్పాటు చేయాలి

కర్నూలు జిల్లా అదోని ఆర్డీవో కార్యాలయం ఎదుట న్యాయవాదులు శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ధర్నా నిర్వహించిన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో శాశ్వత హైకోర్టు లేదా శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆదోని బార్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ల పిలుపు మేరకు మూడు రోజుల పాటు (ఆగస్టు 19 నుండి 21 వరకు) కోర్టు […]

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

హోస్పేట: 19.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 19 (బుధవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1630.03 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 94.171 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి […]

Back To Top
Exit mobile version