కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిష్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులతో ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఉన్న 1లక్ష 18 వేల 700 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్సీ సీతారామారావు తెలిపారు. డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు ఆకస్మికంగా నిర్వహించామని అన్నారు. […]
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.