Day: May 15, 2023

పెళ్లి చూపులకు వెళ్తే విషాదం

కర్నూలు జిల్లా హాలహార్వి మండలం చత్రగుడి ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో బొలెరో వాహనం టైరు పగిలి బొలెరో బోల్తా పడి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. చిన్న మునియప్ప(65) ఇందు(12) పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక బళ్లారిలో పెళ్లి చూపులకు వెళ్తుండగా చంద్రగుడి వద్ద టైరు పగిలి ప్రమాదం చోటుచేసుకుంది. […]

ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు

ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు 15.05.2023 పత్తి క్వింటాల్ ధర గరిష్టం   ₹ 7538-00 మధ్యధర ₹ 7299-00 కనిష్టం   ₹ 4829-00 వేరుశనగలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 7619-00 మధ్యధర ₹ 6849-00 కనిష్టం   ₹ 3806-00 ఆముదాలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 5485-00 మధ్యధర ₹ 5288-00 కనిష్టం   ₹ 4755-00 పూల విత్తనాలు ధర గరిష్టం   ₹ 0000-00 మధ్యధర ₹ 0000-00 కనిష్టం   ₹ 0000-00

పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి

పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలికర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు, సంతేకూడ్లుర్ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న, కెవిపిఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి. తిక్కప్ప మాట్లాడుతూ కుప్పగల్లు, సంతేకూడ్లుర్ గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఐదు వారాలు పైగా ఉపాధి బిల్లులు పెండింగ్ ఉన్నాయని, బిల్లులు చెల్లింపులో […]

మాల జయలక్ష్మి కి న్యాయం చేయాలి..

మాలజయలక్ష్మి కొట్టం తొలగించిన వారిపై కేసు నమోదు చేయాలి..తాసిల్దార్ నిత్యానందయ్యను సస్పెండ్ చేయాలి..ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ ను కలిసిన వినతి పత్రం అందజేసిన చేసిన మాల మహానాడు నాయకులు.. కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ కు స్పందన కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ నందవరం మండలం హలహరి గ్రామంలో ఆగ్రవర్ణాలు గుడిసెలను తొలగించకుండ […]

7 కోట్ల 50 లక్షల రోడ్డు పనులకు భూమి పూజ

కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న కాలనీకు 7కోట్ల 50 లక్షలతో డీఎస్పీ బంగ్లా నుంచి దానపురం వరకు అలాగే ఆలూరు రోడ్డు వరకు బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపల్ మండగిరి లేఔట్ లో జగనన్న కాలనీలో దాదాపు పదివేల 90 ప్లాట్లు ఇవ్వడం జరిగిందాని జగనన్న కాలనీకి లింక్ గా ఉన్న రోడ్డును డీఎస్పీ […]

Back To Top
Exit mobile version