News
మనస్థాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య
తన చావుకు చందా సబ్ దర్గా వాళ్లైన పాన్ షాప్ సలాం మరియు చోటు అని చీటీ వ్రాసుకొని తన వద్ద పెట్టుకొని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోనిలో కార్వాన్ పేట , కరీం దివాస్ దర్గా వద్ద నివాసం ఉంటున్న కంది రాము (47) రాము అనే వ్యక్తి గురువారం 4.5.203 వ తేది రాత్రి 10 గంటలపుడు గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని కుటుంబ సభ్యులను విచారిచాగా సుమారు 14 సం.ల నుండి ఆదోని టౌన్ లోని చందా సాబ్ దర్గా ఇనాం స్తలమ్ లో షెడ్ వేసుకోసి అందులో సప్లయర్ షాప్ మరియు జిరాక్స్ షాప్ పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడని షాప్ ప్రక్కలో స్వంత ఖర్చులతో ఇంకొక షెడ్ కట్టించి దాన్నిని ఎరువుల అంగిడ్ వాళ్లకు ఇచ్చినాడని, అలాగే ఒక స్సం., క్రితం అదే దర్ఘ స్తలంలో ఉన్న ఒక హోటల్ ను తమిళనాడు వాళ్ళ నుండి 8 లక్షలకు కొనగా అపుడు దర్గా వాల్లు ఎలా కొంటావని, ఒక లక్ష ఇచ్చి ఖాలీ చేయించి నారని, అలాగే సుమారు 8 నెలల నుండి రాము నుండి బాడిగ తీసుకోకుండా రాము ఉన్న షాప్ ఖాలీ చేయాలనీ ఒత్తిడి చేసినారని , అందుకు రాము అతని కుటుంబ సబ్యులు ఎంత వేడుకున్నా వాళ్లు వినలేదని పోలీసులకు బంధువులు తెలిపారు. మరల రాము షాప్ వద్దకు వచ్చిఖాలీ చేయండి లేకపోతే ఎక్కడికైనా పోయి చావండి అని చెప్పినారని, అందుకు రాము మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోన్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆదోని రైల్వే SI రామస్వామి దర్యాప్తు చేసి section 306 r/w 34 IPC గా మార్చి సదరు దర్గా హక్కు దారులైన పాన్ షాప్ సలాం , చోటు @ సలీం లపై కేసు నమోదు చేశారు.
News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
