News
ఆకస్మిక తనిఖీ చేసిన. జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
కర్నూలు జిల్లా. ( ఆంధ్ర – కర్ణాటక బార్డర్ )
◆ జిల్లా సరిహద్దులో ఉన్న క్షేత్రగుడి చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
◆ చెక్ పోస్టులలో అప్రమత్తంగా ఉండాలి.
◆ అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

కర్ణాటక రాష్ట్రంలో మే 10 న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా సరిహద్దు ఆలూరు సర్కిల్ , హాలహార్వి పోలీసుస్టేషన్ పరిధిలోని క్షేత్రగుడి, చింతకుంట చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. చెక్ పోస్టులలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. చెక్ పోస్టులలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో డబ్బు , మద్యం , తదితర వస్తువులు అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ , సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




News
బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

News
పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.
-
News2 weeks agoఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
News4 weeks agoఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
-
News2 weeks agoపత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
-
News4 weeks agoమత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
-
News2 weeks agoబస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
-
News3 weeks agoపత్తి కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు
-
News4 weeks agoఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
-
News4 weeks agoవైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం
