కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబళం గ్రామంలో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించరు. నబి ట్రేడర్స్ లో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా, కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా తీసుకొచ్చిన 76 డి ఎ పి ఎరువుల సంచులను సీజ్ చేశారు. వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉన్నట్లు వ్యవసాయ శాఖా అధికారులు తెలిపారు. నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు.
తుంగభద్రా డ్యాం 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు
తుంగభద్ర డ్యాం. 03 07 2025 గురువారం ఇరవై (20) గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన డ్యామ్ అధికారులు. (2.5) రెండు నర్ర అడుగులు ఎత్తుకు 20 గేట్లు ఎత్తి దిగువకు 62766 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపారు. నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు..
Gold, Silver Price బంగారు ధర
Date : 03 07 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 97750-001 గ్రాములు సుమారు రూ. 9775-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 89930-001 గ్రాములు సుమారు రూ. 8993-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1080-00
తుంగభద్రా డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు
తుంగభద్ర డ్యాం. 03 07 2025 గురువారం ఉదయం పనెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు డ్యామ్ అధికారులు. రెండు అడుగులు ఎత్తుకు పనెండు గేట్లు ఎత్తి దిగువకు 39611 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు సమాచారం ఇచ్చారు నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు ఆదేశాలు జారీ చేశారు..
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 03-07-2025
తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1625.53 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 78.239 టీఎంసీలుఇన్ ఫ్లో : 28500 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 13748 క్యూసెక్కులు
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 03 07 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు
ఆదోని డివిజన్ లో కురిసిన వర్షపాత నమోదు
కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో 02వ తేదీ బుధవారం కురిసిన వర్షపాతంపై రెవెన్యూ అధికారులు అధికారులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..1. కౌతాళం Kowthalam : 44.6 mm2. పెద్దకడుబూర్ Peddakadabur : 43.6 mm3.ఎమ్మిగనూరు Yemmiganur : 38.6 mm4.గోనెగండ్ల Gonegandla : 25.6 mm5.ఆదోని Adoni : 21.6 mm6.నందవరం Nandavaram : 18.2 mm7.మంత్రాలయం Mantralayam : 13.6 mm8.కోసిగి Kosigi : 12.6 mm9.హోలాగుంద Holagunda: 9.4 mmఆదోని […]