Day: May 2, 2023

కర్నూల్ లో ఏ‌సి‌బి సోదాలు భారీగా నగదు ఆస్తులు స్వాధీనం

కర్నూలు నగరంలో డి‌జి‌పి శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు కర్నూలు జిల్లా డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాతకు చెందిన ఇల్లు, కార్యాలయం తోపాటు కర్నూలు నగరం లోని ఐదు ప్రాంతలలోని ఆమె బంధువుల ఇళ్ళలో అవినీతి నిరోధక శాఖ(ఏ‌సి‌బి) కర్నూలు విభాగం అధికారుల బృందం ఉదయం నుండి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత నుండి ఇప్పటివరకు స్వాధీనం […]

సీఎం జగన్‌తో యూఏఈ రాయబారి సమావేశం

తాడేపల్లి: క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌ నాసర్‌ అల్షాలి. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు.. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని అబ్దుల్ నాసర్‌కు సీఎం హామీ ఇ‍చ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను యూఏఈ రాయబారికి సీఎం వివరించారు.. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫుడ్‌ పార్క్‌లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్‌ హైడ్రోజన్, పోర్ట్‌లు, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లు, […]

AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. డీఏలు విడుదల

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ అందించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏలను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.. G.O. Ms. No 66 ద్వారా ఉద్యోగులకు డీఏ.. G.O. Ms. No. 67 ద్వారా పెన్షనర్లకు DR 2.73% మంజూరు చేసింది. ఈ కొత్త డీఏను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ప్రభుత్వం అందజేయనుంది. కాగా జనవరి 2022 నుంచి జూన్ 2023 […]

జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు..!

GST collection: దిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో (GST collections) సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్‌ నెలకు గానూ రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి.. గతేడాది ఏప్రిల్‌లో రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లు 12 శాతం మేర వృద్ధి నమోదైంది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఇదే తొలిసారి.ఏప్రిల్‌ నెలకు గానూ రూ.1,87,035 కోట్లు వసూలు అవ్వగా.. అందులో సీజీఎస్టీ కింద రూ.38,440 […]

తాసిల్దార్ వెంకటలక్ష్మి ప్రజలకు శుభవార్త తెలిపారు

కర్నూలు జిల్లా ఆదోని తాసిల్దార్ వెంకటలక్ష్మి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు శుభవార్త తెలిపారు. రేపటినుండి చిరుధాన్యాల కింద ఒక రేషన్ కార్డుకు ఉన్న లబ్ధిదారునికి ఒక కేజీ జొన్నలు పంపిణీ చేయడం జరుగుతుందని. ఒక కార్డు లబ్ధిదారునికి 20 కేజీలు బియ్యంలో ఒక కేజీ తగ్గించి ఒక కిలో జొన్నలు ఇవ్వడం జరుగుతుందని తాసిల్దార్ వెంకటలక్ష్మి తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రేషన్తోపాటు జొన్నలు కూడా పంపిణీ చేస్తామని తాసిల్దార్ వెంకటలక్ష్మి.తెలియజేశారు.

Back To Top
Exit mobile version